'పుష్ప' రిలీజ్ డేట్ పై పుకార్లు .. క్లారిటీ రావలసిందే!

  • స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప'
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ పరిచయం
  • బన్నీ అభిమానుల్లో సందేహాలు
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అడవి నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణ ప్రధానాంశంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అల్లు అర్జున్ జోడీగా రష్మిక కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇతనికి తెలుగులో ఇదే తొలి సినిమా.

ఇక ప్రకాశ్ రాజ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా డిసెంబర్ కి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది.

నిజానికి 'పుష్ప' కథా నేపథ్యం చాలా క్లిష్టతరమైనది. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ఈ కథను కెమెరాలోకి ఎక్కించడం చాలా కష్టం. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోతూ .. మళ్లీ మొదలవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను డిసెంబర్ కి వాయిదా వేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడేవరకూ రిలీజ్ గురించిన ఆలోచన చేయకపోవడం మంచిదనుకున్నారా? కరోనా కలిగించే అంతరాయాల కారణంగా ఆగస్టుకి అన్నిపనులు కావనుకున్నారా? అనేదే సందేహం. ఏది పుకారు? .. ఏది ఖరారు? అనేది సుకుమార్ క్లారిటీ ఇస్తేనేగానీ ఈ ప్రచారానికి తెరపడేలా లేదు.


More Telugu News