రేపే షర్మిల నిరాహారదీక్ష.. అనుమతి మంజూరు చేసిన పోలీసులు!
- హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్ష
- ఒక్కరోజు దీక్షకు మాత్రమే అనుమతించిన పోలీసులు
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష
తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించనున్న వైయస్ షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగసభను నిర్వహించిన షర్మిల... ఇప్పుడు మరో సంచలన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. రేపు ఆమె నిరాహారదీక్షను చేపట్టబోతున్నారు. నిరాహారదీక్ష చేస్తానని ఈ నెల 9న ఖమ్మంలో జరిగిన సభలో ఆమె ప్రకటించారు.
ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే నిరాహారదీక్ష చేస్తానని అప్పుడు ఆమె హెచ్చరించారు. చెప్పిన విధంగానే ఆమె ఇప్పుడు దీక్షకు సిద్ధమయ్యారు. అయితే, మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేయాలని ఆమె అనుకున్నప్పటికీ... పోలీసులు ఒక రోజు దీక్షకు మాత్రమే అనుమతిని ఇచ్చారు.
హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేసేందుకు పోలీసులు అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. షర్మిల నిరాహారదీక్ష నేపథ్యంలో, తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. సాగర్ ఉపఎన్నికలపై ఈ దీక్ష ప్రభావం ఎంతమేర ఉంటుందనే చర్చ జరుగుతోంది.