భారత ప్రాదేశిక జలాల్లో ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌డం ప‌ట్ల అమెరికా స్పంద‌న‌!

  • భార‌త భాగ‌స్వామ్యాన్ని గౌర‌విస్తాం
  • ఇండో-ప‌సిఫిక్‌లో ప్రాంతీయ భ‌ద్ర‌త కూడా అందులో భాగం
  • అమెరికా ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి ప్ర‌క‌ట‌న  
భారత ప్రాదేశిక జలాల్లో లక్షదీవులకు సమీపంలో నౌకాదళ ఆపరేషన్‌ నిర్వహించినట్లు అమెరికా తెలిపిన విష‌యం తెలిసిందే. ‘స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కు’ను చాటేందుకే తాము ఈ ప‌ని చేశామ‌ని, దీని కోసం భార‌త్ నుంచి ముందస్తు అనుమతిని తీసుకోలేదని కూడా చెప్పింది. అంతేగాక‌, భారత్‌ మితిమీరి కోరుతున్న సముద్ర ప్రాదేశిక హక్కులను సవాల్‌ చేసేందుకు ఇలా చేశామ‌ని అమెరికా ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న చేసింది.

దీనిపై భార‌త్ ఇప్ప‌టికే అభ్యంత‌రాలు తెలిపింది. దీంతో చివ‌ర‌కు అమెరికా వెన‌క్కి త‌గ్గింది. ఈ నెల 7న హిందూ మ‌హా స‌ముద్రంలో నిర్వ‌హించిన సాధార‌ణ ఆప‌రేష‌న్ అంత‌ర్జాతీయ చ‌ట్టాలకు, ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ముద్రాల‌ ‌స్వేచ్ఛకు మ‌ద్ద‌తు తెల‌ప‌డంలో భాగంగా చేశామ‌ని తెలిపింది. ఆయా అంశాల్లో తాము భార‌త భాగ‌స్వామ్యాన్ని గౌర‌విస్తామ‌ని చెప్పింది. ఇండో-ప‌సిఫిక్‌లో ప్రాంతీయ భ‌ద్ర‌త కూడా అందులో భాగమ‌ని  అమెరికా ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.


More Telugu News