పలు దేశాలు బ్యాన్ చేసినా... ప్రపంచ కుబేరుల్లోకి టిక్ టాక్ యజమాని!

  • వీడియో యాప్ గా పాప్యులర్ అయిన టిక్ టాక్
  • బైట్ డ్యాన్స్ వీడియో 250 బిలియన్ డాలర్లకు
  • 50 బిలియన్ డాలర్లకు జాంగ్ వైమింగ్
బైట్ డ్యాన్స్... ప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మాతృసంస్థ. ప్రపంచంలోనే అత్యంత అధిక వాల్యూ కలిగిన స్టార్టప్ సంస్థగా నిలిచిన బైట్ డ్యాన్స్ పై గత సంవత్సరం కొన్ని దేశాల నుంచి ఒత్తిడి వచ్చింది.

అమెరికా ఈ సంస్థను బ్యాన్ చేసింది. ఇండియా సహా ఎన్నో దేశాలు టిక్ టాన్ ను నిషేధించాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైతం టిక్ టాక్ ఎదురొడ్డి నిలిచింది. అంతే కాదు... టిక్ టాక్ ను స్థాపించిన జాంగ్ వైమింగ్ ను ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా చేసింది. కేవలం 38 ఏళ్ల వయసులోనే అతను ఈ ఘనత సాధించడం గమనార్హం.

తాజాగా ప్రైవేట్ మార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ ఈక్విటీ వాటాల విలువ భారీగా పెరిగింది. ఫలితంగా 250 బిలియన్ డాలర్లకు బైట్ డ్యాన్స్ వాల్యూ చేరగా, అందులోని ప్రధాన అనుబంధ విభాగమైన టిక్ టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ కు దాదాపు 25 శాతం వాటా ఉండటంతో అతని సంపద విలువ కూడా 60 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో అతను టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ యజమాని పోనీ మా, బాటిల్డ్ వాటర్ కింగ్ గా పేరున్న జాంగ్ షన్ షాన్, వాల్టన్ అండ్ కోచ్ ఫ్యామిలీస్ తదితరుల సరసన చేరాడని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.


More Telugu News