హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
- హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లేదారుల్లో ఆంక్షలు
- అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్ణయం
- ఆయన విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తోన్న ప్రముఖులు
- లిబర్టీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపుకు రాకూడదు
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లేదారుల్లో ఈ రోజు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించేందుకు ప్రముఖులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఆంక్షలు విధించారు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం కూడలి నుంచి తెలుగు తల్లి వైపు మళ్లిస్తున్నారు.
తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం కూడలి మీదుగా లిబర్టీ వెళ్లే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపునకు వాహనాదారులు ఎవరూ రావద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే, బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు పంపుతున్నారు. మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసు అధికారులు వాహనదారులకు సూచించారు.