కొత్త బంతితో బుమ్రా కంటే షహీన్ అఫ్రిదీ బెటర్ అంటున్న పాకిస్థాన్ మాజీ పేసర్
- బుమ్రా, షహీన్ లపై జావెద్ అభిప్రాయాలు
- కొత్త బంతితో షహీన్ కు ఓటేసిన జావెద్
- డెత్ ఓవర్లలో బుమ్రా ప్రమాదకారి అని వెల్లడి
- అంతర్జాతీయస్థాయిలో ఇద్దరూ నాణ్యమైన బౌలర్లేనని ఉద్ఘాటన
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావెద్ మాత్రం బుమ్రా కంటే షహీన్ అఫ్రిదీ బెటర్ అంటున్నాడు. షహీన్ అఫ్రిదీ ప్రస్తుతం పాక్ జట్టులో ప్రధాన పేసర్ గా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో బుమ్రా కంటే షహీన్ అఫ్రిదీ మెరుగైన బౌలింగ్ కనబరుస్తాడని ఆకిబ్ జావెద్ పేర్కొన్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో కొత్త బంతితో ఇద్దరూ నాణ్యమైన బౌలర్లే అయినా, ఇద్దరిలోకి షహీన్ కాస్తంత మెరుగని అన్నాడు. అయితే చివరి ఓవర్లలో మాత్రం బుమ్రా అత్యంత ప్రమాదకరమని, ఈ అంశంలో షహీన్ కంటే బుమ్రా ఓ మెట్టు పైనే ఉంటాడని ఆకిబ్ జావెద్ అభిప్రాయపడ్డాడు. బుమ్రా ఇప్పటివరకు 19 టెస్టుల్లో 83 వికెట్లు, 67 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. షహీన్ అఫ్రిదీ 15 టెస్టుల్లో 48 వికెట్లు, 25 వన్డేల్లో 51 వికెట్ల తీశాడు.