కడప జిల్లాలో ఎరుకల నాంచారమ్మ జాతరకు హాజరుకానున్న సీఎం జగన్
- 136 ఏళ్ల అనంతరం జాతర
- ఇనగలూరులో ఘనంగా ఏర్పాట్లు
- సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎంపీ, కలెక్టర్
- పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్ ఈ నెల 25న కడప జిల్లా రానున్నారు. శతాబ్దం తర్వాత ఎరుకల నాంచారమ్మ జాతర నిర్వహిస్తుండగా, ఈ వేడుకకు ఆయన హాజరవుతున్నారు. జిల్లాలోని తొండూరు మండలం ఇనగలూరులో ఈ జాతర జరగనుంది. 136 ఏళ్ల తర్వాత ఎరుకల నాంచారమ్మ జాతర నిర్వహిస్తుండడంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, సీఎం రాక నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటన షెడ్యూల్ పై వారు ఓఎస్డీ అనిల్ కుమార్ తో చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం జగన్ ఇనగలూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.