తిరుపతి ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపాలని సీఈసీని కోరాం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ ఎంపీలు
- రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు
- మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్
- సరైన దిశలో విచారణ జరపాలని వ్యాఖ్యలు
- చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలన్న ఎంపీ
టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడి అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు వివరించామని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో సీఈసీని కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల వేళ సీఈసీకి ఎక్కువ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రాళ్ల దాడి ఘటనపై సరైన దిశగా విచారణ జరపాలని, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రచారానికి మరింత భద్రత కల్పించాలని అన్నారు. తిరుపతి ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపాలని కోరామని తెలిపారు. వైసీపీకి ఓటేయకుంటే పథకాలు ఆగిపోతాయని బెదరిస్తున్నారని రామ్మోహన్ ఆరోపించారు. ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.