ఆంధ్రప్రదేశ్ పై కరోనా పడగ... 4 వేలు దాటిన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 35,582 కరోనా పరీక్షలు
- 4,228 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 842 కేసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 10 మంది మృతి
ఏపీలో కరోనా మహమ్మారి మరింత వేగం పెంచింది. గడచిన 24 గంటల్లో 4 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 622, తూర్పు గోదావరి జిల్లాలో 538, విశాఖ జిల్లాలో 414 కేసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 48, కర్నూలు జిల్లాలో 88 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 1,483 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 9,32,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,99,721 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,850 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,321కి చేరింది.