ముందు మీ అయ్యని బూతులు మాట్లాడవద్దని చెప్పు... ఆ తర్వాత నీవు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు: భట్టి విక్రమార్క
- బూతుల సంస్కృతిని తీసుకొచ్చిందే కేసీఆర్
- వ్యవసాయ చట్టాలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు
- ఎన్నికల తర్వాత కేసీఆర్ తో చేతులు కలపడం బండి సంజయ్ కు అలవాటే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏక వచనంతో సంబోధిస్తున్నారని మండిపడ్డారు.
ఇదే కాంగ్రెస్ కాళ్ల ముందు పడి మీ నాన్న కేసీఆర్ దేబిరించిన సంగతిని మర్చిపోయినట్టున్నారని అన్నారు. తిట్లు, బూతుల సంస్కృతిని తీసుకొచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను నువ్వు, మీ అయ్యనే బూతులతో భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు మీ ఇద్దరి బాటలోనే... మిగిలిన నాయకులు కూడా బూతులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఎన్నికలు మీకు వ్యాపారంలా మారిపోయాయని భట్టి మండిపడ్డారు. ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లడం, ఎవరిని ఎంతకు కొనాలని ఆలోచించడం మీకు మామూలు వ్యవహారం అయిపోయిందని అన్నారు. ఎన్నికలు అనగానే లేనిపోని శంకుస్థాపనలు చేయడం... ఎన్నికల తర్వాత వాటిని వదిలేయడం మీకు షరా మామూలు అయిపోయిందని విమర్శించారు.
సాగర్ లో మీరు ఇస్తున్న హామీలు కూడా అలాంటివే అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పారు. ముందు మీ అయ్యని బూతులు మాట్లాడవద్దని చెప్పు... ఆ తర్వాత నీవు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్... ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. జానారెడ్డిలాంటి వ్యక్తి పార్టీ మారుతున్నారంటూ సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోలను విడుదల చేశారని దుయ్యబట్టారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తూ లబ్ధి పొందాలనుకుంటున్నారని అన్నారు. జనారెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పారు. ఎన్నికల ముందు సవాళ్లు విసరడం, ఎన్నికల తర్వాత కేసీఆర్ తో చేతులు కలపడం సంజయ్ కి అలవాటేనని దుయ్యబట్టారు.