నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుని.. పరుగులు పెట్టిన మార్కెట్లు!
- విదేశీ కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం నిర్ణయం
- కేంద్ర నిర్ణయంతో ఇన్వెస్టర్లలో జోష్
- 661 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
కరోనా కేసుల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఏకంగా 1,707 పాయింట్లు పతనమైంది. అయితే ఈరోజు మార్కెట్లు మళ్లీ గాడిలో పడ్డాయి. కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై ప్రభావం చూపింది.
వివిధ దేశాల్లో ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించడంతో ఇన్వెస్లర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 661 పాయింట్లు లాభపడి 48,544కి చేరుకుంది. నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 14,504 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (8.02%), బజాజ్ ఫిన్ సర్వ్ (6.43%), బజాజ్ ఫైనాన్స్ (4.75%), మారుతి సుజుకి (4.60%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.29%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-4.21%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-4.18%), టెక్ మహీంద్రా (-3.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.70%), ఇన్ఫోసిస్ (-1.91%).