హైటెక్ సిటీ ప్రాంతంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు!‌

  • మాదాపూర్ లోని ఓ హోటల్ లో పోలీసుల తనిఖీలు
  • ఐదుగురు వ్యభిచారిణులు, ఒక విటుడు అరెస్ట్
  • రూ. 20 వేల నగదు స్వాధీనం
హైదరాబాదు నగరంలో వ్యభిచార ముఠా దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోంది. ఓవైపు ఈ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ... మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఎంతో మంది ఈ దందాను కొనసాగిస్తున్నారు. హైటెక్ పద్ధతులను పాటిస్తూ, యువతులను వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తూ, విటులకు వల వేస్తున్నారు. తాజాగా నగరంలోని ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ  ప్రాంతంలో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

మాదాపూర్ లోని ఓ హోటల్ లో తనిఖీలను నిర్వహించిన పోలీసులు... వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో ముగ్గురు మహిళలను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 20 వేల నగదును, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News