14 ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ సెంటర్లుగా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం.. మరో 101 ఆసుపత్రులకు కీలక ఆదేశాలు!

  • కేవలం కరోనా పేషెంట్లను మాత్రమే చేర్చుకోవాలంటూ ఆదేశాలు
  • జాబితాలో సర్ గంగారామ్ హాస్పిటల్ కూడా
  • కరోనా పేషెంట్లకు ఐసీయూ బెడ్లను కేటాయించాలంటూ 101 ఆసుపత్రులకు ఆదేశాలు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో... ఆసుపత్రులు పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని 14 ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్లుగా ప్రకటించింది. వీటిలో సర్ గంగారామ్ హాస్పిటల్ వంటివి కూడా ఉన్నాయి. ఈ 14 ప్రైవేట్ ఆసుపత్రులకు ఢిల్లీ ప్రభుత్వం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది.

కేవలం కరోనా పేషెంట్లను మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని, ఇతర రోగులను చేర్చుకోరాదని ఆదేశించింది. అంతేకాదు కనీసం 80 శాతం ఐసీయూ బెడ్లను కరోనా ట్రీట్మెంట్ కోసం కేటాయించాలని మరో 19 ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కనీసం 60 శాతం ఐసీయూ పడకలను కరోనా పేషెంట్లకు కేటాయించాలంటూ మరో 82కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించింది.

పూర్తిగా కోవిడ్ సెంటర్లుగా మారిన ఢిల్లీ ఆసుపత్రులు ఇవే:
  • ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్
  • సర్ గంగారామ్ హాస్పిటల్
  • హోలీ ఫ్యామిలీ హాస్పిటల్
  • మహారాజా అగ్రసేన్ హాస్పిటల్
  • మ్యాక్స్ ఎస్ఎస్ హాస్పిటల్
  • ఫోర్టిస్ హాస్పిటల్
  • మ్యాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
  • వెంకటేశ్వర్ హాస్పిటల్
  • శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్
  • జైపూర్ గోల్డెన్ హాస్పిటల్
  • మాతా చనన్ దేవి హాస్పిటల్
  • పుష్పావతి సింఘానియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • మణిపాల్ హాస్పిటల్
  • సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.


More Telugu News