అమెరికాలోని పాఠ‌శాల‌లో కాల్పుల క‌ల‌క‌లం

  • టేనస్సీలోని నాక్సివిల్లే నగరంలో ఘ‌ట‌న‌
  • ఆస్టిన్ ఈస్ట్ మాగ్నెట్ హైస్కూల్‌లో కాల్పులు
  • ఓ విద్యార్థి మృతి
  • మ‌రో విద్యార్థి, పోలీస్ అధికారికి గాయాలు
అమెరికాలోని పాఠ‌శాల‌లో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. తుపాకీ సంస్క‌ృతిని నియంత్రించాల‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవ‌లే ఓ ప్రతిపాదన చేశారు. ఇంత‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తాజాగా, టేనస్సీలోని నాక్సివిల్లే నగరంలోని ఆస్టిన్ ఈస్ట్ మాగ్నెట్ హై స్కూల్‌లో కాల్పులు జ‌రిగాయి. దీంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

ఇందులో ఓ పోలీస్ అధికారి గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ కాల్పులు ఎందుకు జ‌రిగాయ‌న్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని, కాల్పుల్లో గాయ‌ప‌డి ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స  తీసుకుంటోన్న విద్యార్థిని విచారిస్తే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని పోలీసులు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.


More Telugu News