ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలన్న పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. పిటిషన్ దారుడికి ఫైన్!
- ఈ పద్యాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్న వసీం రిజ్వీ
- పిటిషన్ పూర్తిగా అవివేకమైనదన్న ధర్మాసనం
- వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధింపు
ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పూర్తిగా అవివేకమైనదంటూ జస్టిస్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేశ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధించింది.
ఖురాన్ లోని 26 పద్యాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పిటిషన్ లో రిజ్వీ పేర్కొన్నారు. ఈ పద్యాలు కొందరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని... అందువల్ల వీటిని ఖురాన్ నుంచి తొలగించాలని కోరారు. ఇస్లాం మతం క్షమాగుణం, సమానత్వం, ధర్మం, సహనంపై ఆధారపడి ఉంటుందని... అయితే, కొందరు వ్యక్తులు ఈ పద్యాలను ఆధారంగా చేసుకుని ఇస్లాంకు తప్పుడు భాష్యాన్ని చెపుతున్నారని తెలిపారు. ఈ పద్యాల వల్ల ఇస్లాం అసలు స్వభావం నుంచి దూరమవుతోందని చెప్పారు. అయితే, ఆయన వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేస్తూ, జరిమానా విధించింది .