భద్రాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ఈ నెల 27న ముగియనున్న ఉత్సవాలు
- 21న శ్రీరామ నవమి
- నిరాడంబరంగా వేడుకలు
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రీరామ నవమి, తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు ఇవి కొనసాగుతాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు, ఉత్సవాల నేపథ్యంలో 27వ తేదీ వరకు నిత్య కల్యాణాలను నిలిపివేశారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ ఉదయం మూలమూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఉదయం సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ద్వాదశారాధనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.