సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఉప్పెన' భామకు తమిళంలో ఛాన్స్  
  • 'కింగ్ మేకర్'గా రానున్న చిరంజీవి?
  • 'బాహుబలి' నిర్మాతల వెబ్ సీరీస్  
*  'ఉప్పెన' సినిమా సూపర్ హిట్ కావడంతో కథానాయిక కృతి శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగులో మూడు నాలుగు సినిమాలు కమిట్ అయిన ఈ ముద్దుగుమ్మకు.. తాజాగా తమిళంలో ధనుష్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయిక పాత్రకు కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'కింగ్ మేకర్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
*  రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ కలసి వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారు. హారర్ కథాంశంతో రూపొందే ఈ సీరీస్ లో కథానాయిక రెజీనా ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది.  


More Telugu News