ఏపీలో కరోనా బీభత్సం... మరోసారి 3 వేలకు పైన కొత్త కేసుల నమోదు
- గత 24 గంటల్లో 33,755 కరోనా పరీక్షలు
- 3,263 మందికి పాజిటివ్
- 11 మంది మృతి
- ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురి కన్నుమూత
- 654 పాజిటివ్ కేసులు
ఏపీలో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో తగ్గినట్టే కనిపించిన కరోనా వ్యాప్తి మార్చి నెల నుంచి మళ్లీ పుంజుకుంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 మందికి పాజిటివ్ అని నమోదైంది. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 654 కొత్త కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో 454, గుంటూరు జిల్లాలో 418, కృష్ణా జిల్లాలో 318 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 1,091 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 11 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించగా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, వైఎస్సార్ కడప, కర్నూల్, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,28,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,98,238 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 7,311 మంది కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.