ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- ఇటీవల రాష్ట్రపతికి అస్వస్థత
- బైపాస్ నిర్వహించిన వైద్యులు
- కోలుకున్న రామ్ నాథ్ కోవింద్
- రాష్ట్రపతి భవన్ కు తిరిగి రాక
- వైద్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు
ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్వస్థతకు గురికాగా, వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాను పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడించారు. ఇవాళే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని, రాష్ట్రపతి భవన్ కు తిరిగొచ్చానని తెలిపారు. తాను సత్వరమే కోలుకోవడానికి కారణమైన ఎయిమ్స్, ఆర్మీ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి, తన ఆరోగ్యం కోసం ప్రార్థించినవారికి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్రపతి భవన్ కు తిరిగొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని కోవింద్ తెలిపారు.