పండ్లు ఇచ్చే చెట్ల పైనే రాళ్లు పడతాయి: సీఎం జగన్
- ఏపీలో ఉత్తమ వలంటీర్లకు అవార్డులు
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
- వలంటీర్లకు మనసారా సెల్యూట్ అంటూ వ్యాఖ్యలు
- వలంటీర్లపై విపక్షాలు దారుణంగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం
- నిజాయతీగా పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని వెల్లడి
ఏపీ వలంటీర్లకు అవార్డులు అందించే కార్యక్రమంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు మనసారా సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. వలంటీర్లలో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ తో పోరాటంలో వలంటీర్ల పాత్ర ఎనలేనిదని కితాబునిచ్చారు.
వలంటీర్ల తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని, రాష్ట్రంలో పరిపాలన అంటే ఏమిటో చూపించామని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే, వలంటీర్ వ్యవస్థలపై విపక్షాలు దారుణంగా మాట్లాడుతున్నాయని అన్నారు. పండ్లు ఇచ్చే చెట్లపైనే రాళ్లు పడతాయని, నిజాయతీగా పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.