వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఏపీ ముఖ్యమంత్రికి సీపీఐ రామకృష్ణ లేఖ
- ఆంధ్రప్రదేశ్‌లోని నీటి ప్రాజెక్టులపై చర్చించాలి
- కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని కేంద్రం ఖరారు చేయనుంది
- ఈ నెల 15న ఉత్తర్వులు ఇవ్వనుంది
- రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం జరిగే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లోని నీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు ఇవ్వనుందని ఆయన చెప్పారు.
బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించిందని, విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో కేంద్ర సర్కారు తాత్కాలిక సర్దుబాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే, కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తే రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం జరిగే అవకాశం ఉందని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. వీటిపై చర్చించాల్సి ఉందని చెప్పారు.