భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర
- రేపటితో ముగియనున్న సునీల్ అరోరా పదవీ కాలం
- సుశీల్ చంద్ర పేరును ఖరారు చేసిన ప్రభుత్వం!
- సుశీల్ హయాంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు
ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర భారత తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సునీల్ అరోరా పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎన్నికల కమిషన్‌లో అత్యంత సీనియర్ కమిషనర్ అయిన సుశీల్ చంద్రను సీఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు 14 ఫిబ్రవరి 2019న సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితుయ్యారు. 14 మే 2022 వరకు ఆయన నిర్వచన్ భవన్ చీఫ్‌గా కొనసాగుతారు. సుశీల్ హయాంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఆయా ప్రభుత్వాల పదవీ కాలం ముగుస్తుంది.
కాగా, 1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన సుశీల్ చంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావడానికి ముందు సీబీడీటీ చైర్మన్‌గా పనిచేశారు. నోట్ల రద్దు సమయంలో కీలకంగా పనిచేశారు.