కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. 1,300 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనం!
- దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
- అమ్మకాలకు మొగ్గుచూపుతున్న ఇన్వెస్టర్లు
- 400 పాయింట్లు పతనమైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 1,68,912 కొత్త కేసులు నమోదు కావడం... గత ఏడు రోజుల్లో ఇది 6వ రికార్డు స్థాయి పెరుగుదల కావడం తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం 1.35 గంటల సమయంలో సెన్సెక్స్ 1,347 పాయింట్లు కోల్పోయి 48,236 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 400 పాయింట్ల నష్టంతో 14,434 వద్ద కొనసాగుతోంది.
బ్యాంకెక్స్, మెటల్, పవర్, ఫైనాన్స్, రియాల్టీ, ఎనర్జీ తదితర సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెక్, ఐటీ, హెల్త్ కేర్ సూచీలు మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాక్ (6.95), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.34), బజాజ్ ఫైనాన్స్ (6.56) టాప్ లూజర్లగా కొనసాగుతున్నాయి.