నెమలిని ఆట పట్టిద్దామనుకున్న హీరోయిన్... ఎగిరి దుముకుతూ దాడి చేసిన మయూరం... వీడియో ఇదిగో!

  • గోపీచంద్ పక్కన నటిస్తున్న దిగంగనా సూర్యవంశీ
  • మయూర సంరక్షణ కేంద్రానికి వెళ్లిన దిగంగన
  • ఆడుతూ పరవశిస్తుంటే దాడి
బిగ్ బాస్ ఫేమ్, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తుండగా, సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న దిగంగ‌న సూర్య‌వంశీ, ఓ నెమలితో ఆటాడబోయి చిక్కుల్లో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ లో పలు సీరియ‌ల్స్, సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఆమె, ఇటీవల నెమళ్లను సంరక్షించే కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఉన్న మయూరాలను చూస్తూ, ఆమె పరవశిస్తూ, వాటితో ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ నెమలి అమాంతం గాల్లోకి ఎగిరి, ఆమెపై దాడి చేసింది. దీంతో దిగంగన గట్టిగా కేకలు పెట్టడంతో, పక్కనే ఉన్నవారు ఆమెకు సహాయంగా వచ్చారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News