ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్

  • మరో చిత్రానికి ఎన్టీఆర్ సన్నాహాలు
  • ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
  • దర్శకుడిగా త్రివిక్రమ్, కొరటాల పేర్లు ప్రచారం 
  • రేపటి ప్రకటనపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను తారక్... త్రివిక్రమ్ శ్రీనివాస్ లేక కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాపై రేపు అధికారిక అప్ డేట్ రానుంది.

కాగా ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు', 'చౌడప్ప నాయుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప ఒక్కటి కూడా అధికారిక సమాచారం లేదు. రేపటి ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నారు.



More Telugu News