తెలంగాణలో మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా... అధికారిక ఉత్తర్వులు జారీ
- తెలంగాణలో ఉద్ధృతంగా కరోనా
- కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆదేశం
- కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు స్పష్టీకరణ
తెలంగాణలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇకపై మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానాగా వడ్డిస్తారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిచేసే ప్రదేశాల్లోనూ మాస్కు తప్పనిసరి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు.