12 రోజుల వ్యవధిలో ఇద్దరి మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్

  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • మార్చి 30న గ్రామ కార్యదర్శి ఉమాకాంత్ మృతి
  • టిప్పర్ ఢీకొనడంతో దుర్మరణం
  • డ్రైవర్ గంగాధర్ అరెస్ట్
  • అదే రోజు బెయిల్ పై విడుదల
  • నిన్న మరోసారి యాక్సిడెంట్
నిజామాబాద్ జిల్లాలో ఓ టిప్పర్ డ్రైవర్ ఇద్దరి మృతి కారణమయ్యాడు. అది కూడా 12 రోజుల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు చేశాడు. ఆ డ్రైవర్ పేరు గంగాధర్. తొలుత మార్చి 30న ఉమాకాంత్ అనే గ్రామ కార్యదర్శి మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ గంగాధర్ ను అరెస్ట్ చేశారు. టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రైవర్ గంగాధర్ అరెస్టయిన రోజే బెయిల్ లభించడంతో విడుదలయ్యాడు. కొన్నిరోజుల తర్వాత టిప్పర్ ను కూడా యజమానికి అప్పగించారు.

అయితే, శనివారం నిజామాబాద్ జిల్లా ఇంద్రాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్క కృష్ణ అనే సైక్లిస్టు దుర్మరణం పాలయ్యాడు. ఈ యాక్సిడెంటు చేసింది కూడా గంగాధరే. దాంతో ఆ డ్రైవర్ పై మరోసారి కేసు నమోదైంది. కొన్నిరోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతికి కారకుడయ్యాడంటూ అతడి డ్రైవింగ్ లైసెన్స్ తొలగింపుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


More Telugu News