తమను కించపరిచేలా సినిమా సీన్లు ఉన్నాయంటూ హాస్యనటుడు యోగిబాబుపై ఫిర్యాదు
- మండేలా సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన యోగిబాబు
- నాయీ బ్రాహ్మణుడిగా నటించిన యోగి
- పోలీసులకు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం ఫిర్యాదు
తమిళ నటుడు యోగిబాబు నటించిన మండేలా సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు తమను కించ పర్చేలా ఉన్నాయంటూ నాయీ బ్రాహ్మణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమను కించపర్చేలా సన్నివేశాలు ఉండడమే కాకుండా వైద్య రంగానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది.
ఆ సినిమా దర్శక, నిర్మాతలతో పాటు యోగిబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మణ సంఘం కోరింది. కాగా, మండేలా సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. నాయీ బ్రాహ్మణుడి పాత్రలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. యోగిబాబు తమిళ సినీరంగంలో టాప్ కమెడియన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. పెద్ద హీరోల పక్కనా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.