సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్: వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి!
- 2004లో మరణించిన వీరప్పన్
- అడవుల్లో భారీ నిధి దాచారు
- దాని గురించి తెలిసిన వారెవరకూ బతికిలేరన్న విజయలక్ష్మి
ఒకప్పుడు సత్యమంగళం అడవులను ఏలుతూ, తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్, అదే అడవుల్లో భారీ నిధులతో కూడిన డంప్ ను దాచి పెట్టారని ఆయన కుమార్తె విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వీరప్పన్ కు, ఆయన భార్య ముత్తులక్ష్మికి విద్యారాణి, విజయలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్న సంగతి తెలిసిందే. విద్యారాణి బీజేపీలో చేరి మహిళా నేతగా ఉండగా, ప్రస్తుతం విజయలక్ష్మి 'రన్ పిళ్లై' పేరిట ఓ చందనపు దొంగ బయోపిక్ లో నటిస్తున్నారు.
తాజాగా చిత్ర యూనిట్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ సినిమా కథకు, తన తండ్రి జీవితానికి సంబంధం లేదని తెలిపారు. సత్యమంగళం అడవుల్లోనే ఆయన తన జీవితాన్ని గడిపారని, ఆయన అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు.అదే అడవుల్లో ఆయన పెద్ద నిధినే దాచివుంచారని, దాన్ని వెలికి తీయాలని కోరారు. ఈ నిధి ఎక్కడ ఉందన్న విషయం తెలిసిన వారెవరూ ఇప్పుడు జీవించి లేరని, అది ఎక్కడుందో కనిపించడం అతి పెద్ద సవాలని అన్నారు.