రాణించిన రైనా, శామ్ కరన్... చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 7 వికెట్లకు 188 రన్స్
- ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ చెన్నై
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
- రైనా అర్ధసెంచరీ.. చివర్లో ధాటిగా ఆడిన శామ్ కరన్
- క్రిస్ వోక్స్, ఆవేశ్ ఖాన్ లకు రెండేసి వికెట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54), శామ్ కరన్ (34) అదరగొట్టారు. ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి చెన్నైకి బ్యాటింగ్ అప్పగించింది.
అయితే, చెన్నై 7 పరుగులకే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ (36) జోడీ ఎడాపెడా షాట్లు బాదడంతో స్కోరు ఊపందుకుంది. ఆ తర్వాత అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (26) కూడా వేగంగా పరుగులు సాధించారు.
ఓ దశలో చెన్నై 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా శామ్ కరన్ ధాటిగా ఆడడంతో చెన్నై భారీస్కోరు సాధించింది. 15 బంతులు ఎదుర్కొన్న శామ్ కరన్ 4 ఫోర్లు, 2 భారీ సిక్సులతో అలరించాడు. వాటిలో ఒకటి తన సోదరుడు టామ్ కరన్ బౌలింగ్ లో బాదాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, టామ్ కరన్ లకు చెరో వికెట్ లభించింది.