సూళ్లూరుపేటలో చంద్రబాబు రోడ్ షో... ఏపీ పోలీసులపై విమర్శనాస్త్రాలు
- పనబాక లక్ష్మి తరఫున చంద్రబాబు ప్రచారం
- పోలీసులు పంచాయతీ ఎన్నికల్లో విర్రవీగారని వ్యాఖ్యలు
- ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేశారని ఆరోపణ
- నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించారని ఆగ్రహం
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం సందర్భంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు తన ప్రచారం సందర్భంగానూ పోలీసులు వచ్చారని, మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఇదే పోలీసులు విర్రవీగారని వ్యాఖ్యానించారు.
"ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేశారు ఈ పోలీసులే. నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరించింది కూడా ఈ పోలీసులే. నామినేషన్లు వేస్తే ఉపసంహరించుకునేలా చేసి బలవంతపు ఏకగ్రీవాలు అయ్యేలా చేసింది కూడా ఈ పోలీసులే. ఎన్నికలయ్యాక రాత్రిపూట కరెంట్ తీసి వైసీపీకి అనుకూలంగా ఫలితాలను మార్చింది ఈ పోలీసులే. ఆ రోజున అన్ని చేసిన పోలీసులు ఈ రోజున ఏమీ చేయడంలేదు... ఎందుకని అంటే... ఈ పార్లమెటు స్థానం ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది కాబట్టి.
అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడకపోతే వీళ్ల ఉద్యోగాలు గోవిందా గోవింద! 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. పోలీసులు మీరు కూడా చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించండి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి కష్టాల్లో పడవద్దని పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ ప్రసంగించారు.