రత్నప్రభ బీజేపీ అభ్యర్థి అని జనసేన కార్యర్తలు అనుకోవడంలేదు: టీడీపీ నేత రామానాయుడు
- తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ ఆసక్తికర రాజకీయాలు
- తిరుపతి లోక్ సభ స్థానం బరిలో త్రిముఖ పోరు
- బీజేపీ-జనసేన అభ్యర్థిగా రత్నప్రభ
- ఆమెను జనసైనికులు వైసీపీ అభ్యర్థిగా భావిస్తున్నారన్న నిమ్మల
- ఉప ఎన్నికలో జనసైనికులు టీడీపీకి ఓటు వేస్తారని వెల్లడి
ఏపీ రాజకీయాలు ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికపై కేంద్రీకృతం అయ్యాయి. తిరుపతిలో త్రిముఖ పోరు నెలకొంది. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీచేస్తుండగా, టీడీపీ పనబాక లక్ష్మిని బరిలో దించింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రత్నప్రభను బీజేపీ అభ్యర్థి అని జనసేన కార్యకర్తలు భావించడంలేదని అన్నారు. రత్నప్రభను వైసీపీ అభ్యర్థిగానే భావిస్తున్న జనసేన కార్యకర్తలు ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. రత్నప్రభకు ఓటు వేయడం జనసైనికులకు ఇష్టంలేదని, ఆమె బీజేపీ అభ్యర్థి అని ఎవరూ భావించడంలేదని పేర్కొన్నారు. తిరుపతి లోక్ సభ స్థానానికి బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను బరిలో దింపడం తెలిసిందే. రత్నప్రభ బీజేపీ నేత.