ఏపీలో వ‌కీల్ సాబ్ సినిమాకు ప్ర‌త్యేక‌ ప్ర‌దర్శ‌న‌లపై పూన‌మ్ కౌర్ వ్యాఖ్య‌లు

  • సినిమాలకు, రాజకీయాలకు మధ్య సంబంధం ఉంది
  • అది పెద్దలు కుదిర్చిన పెళ్లిలాంటింది
  • కాపురం చేయకపోతే మాత్రం ఫీల్‌ అయ్యేది ప్రజలే
  • మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్‌ చేయాలి
  • కుళ్లు రాజ‌కీయాలు మానేయాలి
'వ‌కీల్ సాబ్' వంటి పెద్ద సినిమాకు బెనిఫిట్, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం జీవోలను విడుదల చేసి ఆటంకాలు సృష్టించింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే ఏపీ స‌ర్కారు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు ఆటంకాలు సృష్టిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై సినీ న‌టి పూనమ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన పెళ్లిలాంటింద‌ని ఆమె ట్వీట్ చేసింది. ఇది ఓ వ్యవస్థీకృత సంబంధం అంటూ కామెంట్ చేసింది. అయితే, అది కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాల‌ని చెప్పుకొచ్చింది. కాపురం చేయకపోతే మాత్రం ఫీల్‌ అయ్యేది ప్రజలేన‌ని చెప్పింది.

మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్‌ చేయాలని పూనమ్ కౌర్ చెప్పింది. అంతేగానీ, డీ ఫేమింగ్‌ ఆర్గనైజ్డ్‌ ట్రెండ్‌ ఏంటో? అంటూ ప్ర‌శ్నించింది. ఇప్పుడు కుళ్లు రాజకీయాలు ఎవ‌రు చేస్తున్నారు? అని నిల‌దీసింది. అమ్మాయిలను డీఫేమ్‌ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదని, అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్‌ ఎవరికి? అని ప్ర‌శ్నించింది. చివ‌రికి పోసానిగారు ప్రెస్‌మీట్‌? అని పేర్కొంది.


More Telugu News