'వకీల్ సాబ్' స్క్రీన్ పై రక్తంతో పవన్ పేరు రాసిన అభిమాని... దిగ్భ్రాంతికి గురైన అనసూయ

  • మూడేళ్ల తర్వాత వకీల్ సాబ్ తో తిరిగొచ్చిన పవన్
  • వకీల్ సాబ్ కు బ్లాక్ బస్టర్ టాక్
  • పట్టరాని సంతోషంలో పవర్ స్టార్ ఫ్యాన్స్
  • ఓ అభిమాని తీరు భయానకంగా ఉందన్న అనసూయ
పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన వకీల్ సాబ్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవన్ ను మళ్లీ తెరపై చూసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. పైగా సినిమా సూపర్ అంటూ అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో వారి జోష్ మామూలుగా లేదు. అయితే, సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ మేనియాను చాటాలే ఓ వీడియో వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ లో తెరపై అభిమాని ఒకరు రక్తంతో పవన్ పేరు రాయడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో పట్ల ప్రముఖ నటి, యాంకర్ అనసూయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చూడ్డానికి భీతిగొలిపేలా ఉందని వ్యాఖ్యానించారు.  "ఇదేం అభిమానం... తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించరా? బాధ్యతగా వ్యవహరించాలి. అయినా అభిమానం ప్రదర్శించుకోవడానికి చాలా మార్గాలున్నాయి" అని హితవు పలికారు.


More Telugu News