తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ కార్యకర్తలకు ఆయుధం: చంద్ర‌బాబు

  • టీడీపీ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డకూడ‌దు
  • దొంగ ఓట్ల‌ను అడ్డుకోవాలి
  • తిరుప‌తిలో టీడీపీ విజయం ఖాయం
  • వైసీపీ ఇప్పుడు భ‌య‌ప‌డుతోంది
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు  ఈ రోజు నెల్లూరులో త‌మ పార్టీ నేత‌ల‌తో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ కార్యకర్తలకు ఆయుధమ‌ని, కార్యకర్తలు భయపడకూడ‌ద‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌లో దొంగ ఓట్లను కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవాలని ఆయ‌న కోరారు.

తిరుప‌తిలో త‌మ పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్య‌క్తం చేశారు. మొద‌ట ఐదు లక్షల మెజార్టీతో గెలుపొందుతామని వైసీపీ ప్రకటించింద‌ని, ఇప్పుడేమో ఓట‌మి భ‌యంతో ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసు రాజ్యం నడుస్తోందని విమ‌ర్శించారు.

త‌మ‌పై ఎన్నికేసులు పెట్టినా భయపడబోమని చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌ను బహిష్కరించడం బాధాకరమే అయినప్ప‌టికీ, తాము తప్పనిసరి పరిస్థితులలోనే ఆ నిర్ణయం తీసుకున్నామ‌ని వివ‌రించారు.


More Telugu News