కన్యత్వ పరీక్షలో విఫలమైందట.. ఇంటి నుంచి భార్యను గెంటేసిన భర్త!
- మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘటన
- పెళ్లయిన వెంటనే కన్యత్వ పరీక్షలు చేయడం కంజర్భట్ తెగ ఆచారం
- విఫలమైన ఓ మహిళ
- ఇద్దరికీ విడాకులిస్తున్నట్టు పంచాయతీ పెద్దల తీర్పు
కన్యత్వ పరీక్షలో విఫలమైన భార్యను ఇంటి నుంచి గెంటేశాడో భర్త. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కంజర్భట్ తెగకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గతేడాది నవంబరులో బెల్గాంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన వెంటనే భార్యలకు కన్యత్వ పరీక్షలు చేయించడం కంజర్భట్ తెగ ఆచారం. ఇందులో భాగంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షలు నిర్వహించగా ఒకామె విఫలమైంది.
ఇక అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. భర్తతోపాటు అత్తమామలు కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారం పెద్దలకు చేరగా, ఫిబ్రవరిలో పంచాయితీ నిర్వహించారు. బాధిత అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తున్నట్టు పెద్దలు తీర్పు చెప్పారు. దీంతో వారిద్దరూ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.