మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో
- బెంగాల్‌లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన బాబుల్ సుప్రియో
- టీఎంసీ భయంకర రాజకీయాలకు ముగింపు పలకాలన్న మంత్రి
- కూచ్‌బెహర్‌లో కొట్టుకున్న టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నేడు నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విడతలో పోటీలో ఉన్న కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తాను పోటీ చేస్తున్న టోలిగంజ్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దింపడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని అన్నారు. దీదీకి కుడిభుజమైన అరూప్ బిశ్వాస్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారని, వారి భయంకర రాజకీయాలకు ముగింపు పలకాలని అన్నారు. కాగా, ఈ విడతలోనూ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూచ్‌బెహర్ జిల్లాలోని శీతల్‌కూచి నియోజకవర్గంలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు.