ఏపీలో పదో తరగతి పరీక్షల సమయం పెంపు

  • ఇప్పటికే 11 సబ్జెక్టులు 6కి కుదింపు
  • కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం
  • తాజాగా సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • పరీక్షల్లో పలు సబ్జెక్టులకు అరగంట సమయం పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల సమయం పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషల పరీక్షలకు సమయం పెంచారు. గణితం, సామాజిక, భౌతిక, జీవశాస్త్రాలకు అరగంట సమయం పెంచారు.

 ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించారు. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కి గంటా 45 నిమిషాలు కేటాయించారు. అటు, భాషలు, గణితం, సామాజిక శాస్త్రానికి 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. భౌతికశాస్త్రం, జీవశాస్త్రంలో 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏపీ సర్కారు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 11 సబ్జెక్టులను కాస్తా 6కి కుదించడం తెలిసిందే.


More Telugu News