నారా లోకేశ్ ఓ ఐరన్ లెగ్... ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్: అంబటి

  • తాడేపల్లిలో అంబటి మీడియా సమావేశం
  • లోకేశ్ సవాళ్లు విసరడంపై స్పందన
  • ముందు ఎక్కడైనా గెలిచి ఆపై సవాల్ విసరాలని హితవు
  • సవాళ్లు చేస్తే నాయకులు కాలేరని వ్యాఖ్యలు
  • చంద్రబాబు, లోకేశ్ లను ప్రజలు తరిమికొట్టారని వెల్లడి
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారా లోకేశ్ ఓ ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ మటాష్ అవుతుందని వ్యాఖ్యానించారు. లోకేశ్ ఇటీవల తరచుగా సవాళ్లు విసురుతున్నారని, లోకేశ్ ఎక్కడైనా గెలిచి అప్పుడు సవాల్ చేయాలని హితవు పలికారు. సవాళ్లు చేస్తే నాయకులు అవ్వరని, గెలిచినవాళ్లే నాయకులు అవుతారని పేర్కొన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే చంద్రబాబు, లోకేశ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వీధి వీధి తిరుగుతున్నా జనం రావడంలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రజలు చిత్తుగా ఓడించారని, చంద్రబాబు, లోకేశ్ ను ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారని విమర్శించారు. ఇప్పుడు పచ్చ జెండా పట్టుకోవడానికి కార్యకర్తలు కూడా లేరని అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News