మంగళగిరిలో చిత్తుగా ఓడిన మాలోకం తిరుపతిలో సవాళ్లు విసురుతుంటే జనం నవ్వుకుంటున్నారు: విజయసాయిరెడ్డి
- తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక
- వైసీపీ, టీడీపీ మధ్య విమర్శనాస్త్రాలు
- ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి
- తిరుపతిలో డిపాజిట్ కూడా దక్కదని వ్యాఖ్యలు
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయిన మాలోకం తిరుపతిలో సవాళ్లు విసురుతుంటే జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. సీఎం కొడుకై ఉండి, 3 శాఖలకు మంత్రిగా వెలగబెట్టినా ఓటమిపాలయ్యాడని వ్యంగ్యం ప్రదర్శించారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తండ్రీకొడుకులు ప్రచారం చేసిన చోటల్లా పచ్చ పార్టీ గల్లంతైందని విజయసాయి పేర్కొన్నారు. ఇప్పుడు తిరుపతిలోనూ అందుకు మినహాయింపు కాదని, డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు.