ఇటలీ మెరైన్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- 2012లో భారత జలాల్లో ప్రవేశించిన ఇటలీ నౌక
- ఇద్దరు కేరళ జాలర్లను కాల్చి చంపిన ఇటలీ నావికులు
- విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇటలీకి ఆదేశం
- విదేశీ మంత్రిత్వ శాఖ వద్ద డిపాజిట్ చేయాలని వెల్లడి
2012లో భారత సముద్ర జలాల్లో ప్రవేశించిన ఓ ఇటలీ నౌకకు చెందిన నావికులు ఇద్దరు కేరళ జాలర్లను కాల్చిచంపడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించింది. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని ఇటలీని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ వద్ద రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.
ఈ మొత్తం మృతి చెందిన జాలర్ల కుటుంబ సభ్యులకు చెందాలని పేర్కొంది. ఈ నష్టపరిహారం డిపాజిట్ చేసిన వారం తర్వాత, ఇటలీ మెరైన్లకు వ్యతిరేకంగా నమోదైన కేసును మూసివేయాలన్న కేంద్రం పిటిషన్ పై విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిజ్ ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.