వితంతు పెన్షన్ అందుకుంటున్న పురుషుడు... కర్నూలు జిల్లాలో ఆసక్తికర ఉదంతం
- భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు వితంతు పెన్షన్లు
- 2009 నుంచి వితంతు పెన్షన్ అందుకుంటున్న పురుషుడు
- గుంటూరు జిల్లాలో గుర్తించిన అధికారులు
- కర్నూలు జిల్లా డోన్ అధికారులకు సమాచారం అందజేత
మహిళలకు ఉద్దేశించిన వితంతు పెన్షన్ ను ఓ పురుషుడు అందుకోవడం విస్తుగొలుపుతోంది. అది కూడా గత 12 ఏళ్లుగా ఈ తంతు సాగుతోంది. కర్నూలు జిల్లా డోన్ మండలానికి చెందిన కాశీం అనే వ్యక్తి ప్రతి నెల వితంతు పింఛను అందుకుంటున్నాడు. ఈ వ్యవహారం ఇన్నేళ్లుగా సాగుతున్నా అధికారులు ఏమరుపాటుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎట్టకేలకు అధికారులు ఈ తంతును గుర్తించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కాశీం కొంతకాలం కిందట ఉపాధి నిమిత్తం గుంటూరు జిల్లాకు వెళ్లాడు. ఏప్రిల్ నెల మొదటివారంలో వినుకొండ మండలం చిట్టాపురంలో వితంతు పెన్షన్ కోసం అధికారుల వద్దకు వెళ్లాడు. పురుషుడివి... నీకు వితంతు పెన్షన్ ఎలా వస్తుంది? అని అధికారులు కాశీంను ప్రశ్నించారు. అసలు ఇన్నాళ్లపాటు ఎలా పెన్షన్ తీసుకున్నావంటూ వారు విస్మయానికి గురయ్యారు. ఈ క్రమంలో చిట్టాపురం అధికారులు డోన్ మండలం అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే విచారణకు ఆదేశించారు.