భుజం గాయానికి గురైన టీమిండియా బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ కు శస్త్రచికిత్స
- ఇటీవల ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో అయ్యర్ కు గాయం
- గాయం తీవ్రత కారణంగా శస్త్రచికిత్స
- త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని ధీమా
- ఐపీఎల్ సీజన్ కు దూరమైన అయ్యర్
ఇటీవల ఇంగ్లండ్ తో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ భుజం గాయానికి గురైన సంగతి తెలిసిందే. భుజం గాయం తీవ్రమైనది కావడంతో అయ్యర్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయిందని అయ్యర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. త్వరలోనే మళ్లీ మైదానంలోకి తిరిగివస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు.
గాయానికి శస్త్రచికిత్స కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకషైర్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. గాయం కారణంగా కౌంటీల్లో ఆడేది అనుమానమే.