మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

  • ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచండి
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలను నిర్వహించండి
  • కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయండి
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా... కరోనా మార్గదర్శకాల అమలుపై హైకోర్టుకు రాష్ట్ర డీజీపీ నివేదిక అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలోని మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలను నిర్వహించాలని సూచించింది. కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనల్లో 22 వేల కేసులు నమోదు చేసినట్టు నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై 2,416 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.


More Telugu News