బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. 4 వేలు దాటిన మరణాల సంఖ్య
- కరోనాతో బ్రెజిల్ కకావికలు
- ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించిన మూడో దేశంగా బ్రెజిల్
- 5.7 లక్షల మరణాలతో తొలి స్థానంలో అమెరికా
గతేడాది బ్రెజిల్‌ను కకావికలు చేసిన కరోనా మహమ్మారి అక్కడ మరోమారు చెలరేగిపోతోంది. దాని దెబ్బకు వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. మొన్న ఒక్క రోజే ఆ దేశంలో 4,195 మంది కరోనాకు బలయ్యారు. ఫలితంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 3.40 లక్షలకు చేరువైంది.
5.7 లక్షల కరోనా మరణాలతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. అంతేకాదు, 24 గంటల వ్యవధిలో నాలుగు వేల మరణాలు సంభవించిన మూడో దేశం కూడా బ్రెజిలే కావడం గమనార్హం. గతంలో అమెరికా, పెరూలో మాత్రమే ఒక్క రోజులో ఇన్ని మరణాలు సంభవించాయి.