1100 మంది భారతీయులకు వీసాలు జారీ చేసిన పాకిస్థాన్
- ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వెల్లడి
- వైశాఖి పర్వదినం నేపథ్యంలోనే
- సిక్కులు తమ పవిత్ర స్థలాల్ని దర్శించుకునే అవకాశం
- ద్వైపాక్షిక ప్రొటోకాల్ అమలుకు నిదర్శనం
త్వరలో రానున్న సిక్కుల కొత్త సంవత్సరం వైశాఖి పర్వదినం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారత్‌కు చెందిన 1100 మంది సిక్కులకు వీసాలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో సిక్కుల పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వైశాఖి ఉత్సవాలు జరగనున్నాయి.
వీసాలు పొందిన వారి తీర్థయాత్ర విజయవంతంగా సాగాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఆకాంక్షించింది. పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులను అనుమతించాలన్న ద్వైపాక్షిక ప్రొటోకాల్ అమలులో భాగంగానే వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.