శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రాచీన శాసనాల గుర్తింపు
- శ్రీశైలంలో చిత్ర లిపి శాసనాలు
- రుద్రాక్ష మఠానికి ఉత్తర దిక్కులో గుర్తింపు
- శాసనాలను పరిశీలించిన ఆలయ ఈవో
- ప్రాచీన కాలం నాటి శాసనాలుగా భావిస్తున్న వైనం
దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా శ్రీశైలం క్షేత్రంలో చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. ఇవి చాలా ప్రాచీనమైనవని భావిస్తున్నారు. చిత్ర లిపిలో ఉన్న ఈ శాసనాలు ఆలయ చరిత్రకు అద్దంపట్టే విధంగా ఉన్నాయి.
శ్రీశైలం క్షేత్రంలోని రుద్రాక్ష మఠానికి ఉత్తర దిక్కులోని పరుపుబండపై ఉన్న ఈ శాసనాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ శాసనాలను ఆలయ ఈవో కేఎస్ రామారావు, తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ శాసనాలను మరింత లోతుగా అధ్యయనం చేయిస్తామని ఈవో చెప్పారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని వెల్లడించారు.