విగ్రహాల ధ్వంసం ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ

  • ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం
  • మరోసారి స్పందించిన చంద్రబాబు
  • ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శలు
  • టీడీపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపణ
  • పీఎస్ ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం 
ఏపీలో చాన్నాళ్లుగా ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతుండడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు తాజాగా లేఖ రాశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.

న్యాయం కోరుతున్న టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయా ఘటనల నేపథ్యంలో 40 మంది టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కై విపక్ష నేతలపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చంద్రబాబు తన లేఖలో డిమాండ్ చేశారు. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News