హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకు వెళతాం: వర్ల రామయ్య
- ఏపీలో పరిషత్ ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్
- రేపు యథాతథంగా ఎన్నికలు
- న్యాయసలహా అనంతరం సుప్రీంకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం
- డివిజన్ బెంచ్ తీర్పు పట్ల సంతృప్తికరంగా లేమన్న వర్ల
- చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారని వెల్లడి
ఏపీలో పరిషత్ ఎన్నికలు యథావిధిగా ఏప్రిల్ 8న జరుపుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. న్యాయసలహా అనంతరం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.
ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయంపై స్పందించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు పట్ల సంతృప్తికరంగా లేమని రామయ్య అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 4 వారాల వ్యవధి నిబంధన ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు వెళతామని వెల్లడించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారని, పార్టీ ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారని వివరించారు.