ఐపీఎల్-2021 డిజిటల్ ప్రసార హక్కులు చేజిక్కించుకున్న యుప్ టీవీ
- ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్
- మొత్తం 60 మ్యాచ్ లు
- యుప్ టీవీ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్
- 100 దేశాల్లో డిజిటల్ ప్రసారాలు
- ఐపీఎల్ పాలకమండలిలో యుప్ టీవీ ఒప్పందం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది. మే 30 వరకు జరిగే ఐపీఎల్ పోటీల డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ యుప్ టీవీ చేజిక్కించుకుంది. వివో ఐపీఎల్-2021 టోర్నీలో జరిగే 60 టీ20 మ్యాచ్ ల కంటెంట్ ను యుప్ టీవీ 100 దేశాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలితో ఒప్పందం కుదుర్చుకుంది.
యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, పలు ఆగ్నేయాసియా దేశాలు, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో సైతం యుప్ టీవీ ద్వారా ఐపీఎల్ ప్రసారాలు డిజిటల్ వేదికలపై అందుబాటులోకి రానున్నాయి.
దీనిపై యుప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్ రెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు. యుప్ టీవీ భారత్ లో క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఐపీఎల్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, యూఏఈ నుంచి భారత్ గడ్డకు తిరిగొచ్చిన ఐపీఎల్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని అన్నారు. యుప్ టీవీ ద్వారా డిజిటల్ వినియోగదారులు ఐపీఎల్ ప్రసారాలను వీక్షించేందుకు వీలు కలుగుతుందని వివరించారు.